Breaking News

మన ఊరు.. మనందరి బాధ్యత

మన ఊరు.. మనందరి బాధ్యత

  • అట్టహాసంగా పల్లెప్రగతి ప్రారంభం
  • అభివృద్ధికి అన్ని గ్రామాలు పోటీపడాలి
  • జడ్పీ చైర్​పర్సన్​సరిత తిరుపతయ్య
  • కలిసికట్టుగా గ్రామాల అభివృద్ధి: ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం

సారథి, మానవపాడు: మన ఊరు మనందరి బాధ్యత అనుకుని ప్రతిఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య అన్నారు. గురువారం మానవపాడు మండలం కలుకుంట్ల గ్రామంలో నాలుగోవ విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహంతో కలిసి ఆమె ప్రారంభించారు. రైతు వేదిక భవనం ముందు మొక్కలను వేశారు. గ్రామ సర్పంచ్ ఆత్మలింగారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామం అభివృద్ధిలో పోటీపడి రాష్ట్ర ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డును తీసుకునేలా కృషిచేయాలని ఆమె సూచించారు. గ్రామాల అభివృద్ధిలో మహిళలు ప్రధానపాత్ర పోషించాలని కోరారు. తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు హరితహారంపై కూడా శ్రద్ధపెట్టాలని సూచించారు. అంతకుముందు ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్​గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పల్లెప్రగతి కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారని తెలిపారు. అందరం కలిసికట్టుగా అభివృద్ధికి కృషిచేయాలని కోరారు. గ్రామపంచాయతీకి వచ్చిన నిధులను 50శాతానికి పైగా ఖర్చుచేసి ప్రజలకు అవసరమైన పనులు చేయాలన్నారు.
కంపెనీ వెదజల్లుతున్న బూడిదతో ఇక్కట్లు
కలుకుంట్ల గ్రామంలో ఏర్పాటైన కంపెనీతో బూడిద, దుర్వాసన వెదజల్లడంతో రైతుల పొలాలు నాశనమవుతాయని అంతేకాక అనారోగ్యానికి గురవుతున్నారని ఎంపీపీ కోట్ల అశోక్ రెడ్డి ఎమ్మెల్యే వీఎం అబ్రహాం, జడ్పీ చైర్​పర్సన్​దృష్టికి తెచ్చారు. నష్టపోయిన రైతులకు పరిహారంతో పాటు గ్రామాభివృద్ధికి కంపెనీ యాజమాన్యం స్పందించకపోతే వారిపై చర్యలు తీసుకోవాలని పల్లె ప్రగతిలో సభ దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో పీహెచ్​సీ డాక్టర్​సవిత, సీనియర్ నాయకులు తిరుపతయ్య, మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు.