సారథి న్యూస్, హుస్నాబాద్: రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని రాసులబాద్ సర్పంచ్ పచ్చిమండ్ల స్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని రాసులబాద్ ను రాష్ట్ర ప్రభుత్వం నూతన గ్రామపంచాయతీగా ప్రకటించిదన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పలు సంక్షేమ పథకాలను గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి చేస్తుంటే కొందరు పనిగట్టుకుని అవీనితి, అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శిస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు. గ్రామ పాలకమండలి సభ్యుల తీర్మానం లేకుండా ప్రజాధనం దుర్వినియోగంతో పాటు ఎలాంటి వెంచర్లకు అనుమతివ్వలేదన్నారు. అసత్యపు ప్రచారాలు మానుకుని అభివృద్ధికి కలిసిరావాలని హితవుపలికారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఖైతా రాజేందర్ రెడ్డి, వార్డు సభ్యులు శ్రావణ్, రాములు, ఎండీ అబ్దుల్లా పాల్గొన్నారు.
- March 26, 2021
- Archive
- KOMURAVELLI
- rasulabad
- SIDDIPETA
- VICE MPP
- కొమురవెల్లి
- రాసులబాద్
- సిద్దిపేట
- Comments Off on ఓర్వలేకే విమర్శలు చేస్తున్రు