సారథి, నూగురు వెంకటాపురం: వెంకటాపురం మండలంలోని పాత్రాపురం గ్రామంలో నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న గ్రేస్ అనాథ వృద్ధాశ్రమాన్ని బుధవారం డీడబ్ల్యూవో ప్రేమలత తని ఖీచేశారు. వృద్ధుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. ఆశ్రమం వారు కల్పిస్తున్న సౌకర్యాలను గురించి ఆరాతీశారు. ఆశ్రమం ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా నడుస్తుందా? అనే విషయాలను ఆరాతీశారు. పలురకాల రిజిస్టర్లను పరిశీలించారు. ఆశ్రమానికి ఫండ్స్ ఎలా వస్తున్నాయనే విషయాలను విచారించారు. ప్రభుత్వ సహకారానికి కూడా తమ వంతు కృషిచేస్తామని తెలిపారు. ఇదే విషయమై పై అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని గ్రేస్ హోమ్ నిర్వాహకురాలకు తెలిపారు.
- April 2, 2021
- Archive
- GRACEHOME
- MULUGU
- VENKATAPURAM
- గ్రేస్హోం
- ములుగు
- వెంకటాపురం
- Comments Off on ‘గ్రేస్ హోమ్’లో అధికారుల తనిఖీలు