Breaking News

బోగస్​ ఓట్ల ఏరివేత

నకిలీ ఓటరు జాబితా వద్దు

సామాజిక సారధి, తుర్కయంజాల్: భోగస్ ఓట్ల ఏరివేత కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు ఇబ్రహీంపట్నం ఆర్ డి ఓ వెంకటాచారి తెలిపారు. గురువారం రాగన్న గూడ లోని ఆర్ డి ఓ కార్యాలయం లో ఏర్పాటు చేసిన అల్ పార్టీ మీటింగ్ లో వెంకటాచారి మాట్లాడుతూ అన్ని పార్టీ ల నాయకులు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలని సూచించారు. ఒక్కో ఇంటి నెంబర్ పై న ఆరు ఓట్లు మాత్రమే ఉండాలని అంత కంటే ఎక్కువ ఉన్నట్లయితే తగిన ఆధారాలు చూపించాలని అయన పేర్కొన్నారు. బూత్ లెవల్ ఏజెంట్ లు బూత్ లెవల్ ఆఫీసర్ ల తో సమన్వయము చేసుకొని బోగస్ ఓట్ల తొలగింపు కు సహకరించాలని సూచించారు. తహసీల్దార్ లు అనితారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు బోసు పల్లి ప్రతాప్, అబ్దుల్లా పూర్ మెట్ జడ్పీటీసీ బింగి దాసు గౌడ్, కాంగ్రెస్ నాయకులు జైపాల్ రెడ్డి, సిపిఎం నాయకులు పగడాల యాదయ్య, డి. కిషన్, బీఎస్పీ నాయకులు గ్యార మల్లేష్, ప్రహ్లాద్, తదితరులు పాల్గొన్నారు.