న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే వేడుకలు ఈ సారి విభిన్నంగా వినూత్నరీతిలో కొనసాగనున్నాయి. ఈ ఏడాది ఎన్నో కొత్త శకటాలు దర్శనమివ్వనున్నాయి. రఫేల్ యుద్ధవిమానాలను తొలిసారిగా ఈ ఏడాది పరేడ్‌లో ప్రదర్శించనున్నారు. గత సెప్టెంబర్‌లో ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఈ విమానాలు భారత వైమానిక దళంలో చేరాయి. మొట్టమొదటిసారిగా మహిళా యుద్ధ పైలెట్ లెఫ్ట్‌నెంట్ భావనాకాంత్ ప్రదర్శనలో పాల్గొననున్నారు. భారత వాయుసేనకు చెందిన తేలికపాటి యుద్ధవిమానాలు, యుద్ధ హెలికాప్టర్లు, సుఖోయ్–30 విమాన శకటాలను భావన ముందుండి నడిపిస్తారు. రిపబ్లిక్ డే వేడుకల్లో తొలిసారిగా లద్దాఖ్ ప్రాతినిథ్యం వహించనుంది. లేహ్ జిల్లాలో చారిత్రక థిక్సే మఠాన్ని ప్రదర్శించనున్నారు. థిక్సే కొండలపై ఉన్న ఈ మఠం ఒక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరం తొలిసారిగా శకటంగా దర్శనమివ్వనుంది.
- January 25, 2021
- Archive
- Top News
- జాతీయం
- AYODYA
- lieutenant bhawana kanth
- REPUBLIC DAY
- SUKHOI-30
- అయోధ్య
- రిపబ్లిక్ డే
- లెఫ్ట్‌నెంట్ భావనాకాంత్
- సుఖోయ్–30
- Comments Off on రిపబ్లిక్ డే వేడుకల్లో కొత్త శకటాలు