Breaking News

నెల్లికల్ లిఫ్ట్ నోముల స్వప్నం

నెల్లికల్ లిఫ్ట్ నోముల స్వప్నం
  • విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి
  • రామ్మూర్తి, నర్సింహయ్య విగ్రహాల ఆవిష్కరణ
  • నర్సింహ్మయ్య సస్మరణ సభకు హాజరైన జిల్లా నేతలు

సామాజిక సారథి, హాలియా: దివంగత శాసనసభ్యులు నోముల నరసింహ్మయ్య, గుండెబోయిన రామూర్తి యాదవ్ లు ప్రజల గొంతుకులై నిలిచారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆ నేతలు నిత్యం ప్రజలకోసమే పరితపించారని ఆయన కొనియాడారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని నిడమనూరు మండలం వెంపాడ్ గ్రామంలో దివంగత శాసన సభ్యులు నోముల నరసిహ్మయ్య, గుండెబోయిన రామూర్తి యాదవ్ ల విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం స్థానిక శాసనసభ్యులు  నోముల భగత్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ జీవితాన్ని ప్రజాపోరాటాలకు అంకితం చేశారని అన్నారు. అటువంటి నాయకుడి చిరకాల స్వప్నం నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ పథకమన్నారు. ఆస్వప్నం నెరవేరే సమయం ఆసన్నమైందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు టెండర్లు పూర్తి అయ్యాయని ఆయన తెలిపారు. అటువంటి నేతల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో టీఆర్ఎస్ పార్టీ ముందుంటుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి,  ఎమ్మెల్యేలు యన్.భాస్కర్ రావు, కంచర్ల భూపాల్ రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, చిరుమర్తి లింగయ్య, రవీంద్ర నాయక్, ఫైళ్ల శేఖర్ రెడ్డి, ఎంఎల్సీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.