సారథి, చొప్పదండి: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటుకు చొప్పదండి పట్టణంలోని నవోదయ విద్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, డీపీవో వీరబుచ్చయ్య సోమవారం పరిశీలించారు. ఐసొలేషన్ ఏర్పాటునకు అన్నిరకాల వసతులు ఉన్నందున ఎంపిక చేసినట్లు తెలిపారు. తహసీల్దా్ర్ అంబటి రజిత, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, వైద్యాధికారి రమాదేవికి నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. పనులు వెంటనే ప్రారంభించేలా ఆదేశాలు జారీచేశారు. కార్యక్రమంలో నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ మంగతాయారు, ఎంపీవో జగన్మోహన్ రెడ్డి, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ సురేందర్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఇప్పనపెల్లి విజయలక్ష్మి, మునిసిపల్, వైద్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
- May 24, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- CHOPPADANDI
- ISOLATION
- NAVODAYA
- ఐసొలేషన్ సెంటర్
- చొప్పదండి
- నవోదయ
- Comments Off on ఐసొలేషన్ సెంటర్ గా నవోదయ విద్యాలయం