సామాజిక సారథి, వనపర్తి బ్యూరో:
మదనాపురం మండలం నర్సింగాపురం గ్రామ సర్పంచ్ బక్షి భాగ్యలక్ష్మమ్మ( 80) సోమవారం మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆమె సోమవారం ఉదయం మరణించారు. గ్రామాభివృద్దిలో రాజీపడకుండా పాలన కొనసాగించిన
సర్పంచ్ భాగ్య లక్ష్మమ్మ మృతి చెందడం పై గ్రామస్థులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు.
పలువురి పరామర్శ…
నరసింగాపురం సర్పంచ్ బక్షి భాగ్యలక్ష్మమ్మ మృతి చెందిన సమాచారం తెలుసుకున్న పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అడ్వకేట్లు, రెవెన్యూ ఉద్యోగులు, జర్నలిస్టులు నరసింగాపురం గ్రామానికి భారీగా తరలివచ్చారు. సర్పంచ్ భౌతిక కాయానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జడ్పి చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, టీడీపీ మాజీ ఎంపీ చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ సాయి చంద్, డీఎస్పీ కిషన్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, సీనియర్ జర్నలిస్టులు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
సర్పంచ్ భాగ్యలక్ష్మమ్మ భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు వారు మనో ధైర్యం చెప్పారు. అనంతరం సాయంత్రం జరిగిన అంత్యక్రియల కార్యక్రమానికి కుటుంభ సభ్యులతో పాటు గ్రామస్థులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులు భారీగా తరలివచ్చారు.