– క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేత
సారథి, సిద్దిపేట ప్రతినిధి: గెలుపు ఓటమిలు మైదానంలో ప్రారంభమవుతాయని రేణికుంట గ్రామ సర్పంచి, సర్పంచుల ఫోరం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బొయిని కొమురయ్య అన్నారు. బుధవారం గుండ్లపల్లి సర్పంచి బెతెల్లి సమత రాజేందర్ రెడ్డి తండ్రి బెతెల్లి రాంరెడ్డి 8వ వర్థంతి సందర్భంగా క్రికెట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ క్రీడకారులు క్రీడలు ఆడడం ద్వారా మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం, ఆత్మస్థైర్యం, పట్టుదల పెరుగుతోందన్నారు. నేటి యువత తరగతి గదిలో విద్యాబుద్ధులు నేర్చుకంటే, మైదానంలో ఆడే పలు రకాల క్రీడలతో క్రీడాకారులకు గెలుపు, ఓటములు తెలుస్తాయన్నారు. దీంతో జీవితంలో వచ్చే ఓడిదొడుకులు తట్టుకొగలుగుతారన్నారు. అనంతరం క్రీడల్లో గెలుపోందిన క్రీడాకారులను గొల్లపల్లి సర్పంచి మల్లేత్తుల అంజయ్య, దేవక్కపల్లి ఉపసర్పంచి, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు యువ క్రీడాకారులను అభినందించి బహుమతులను అందజేశారు.