- జిల్లా జడ్జి పాపిరెడ్డి
సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: మహిళల కోసం ఎన్నో చట్టాలున్నప్పటికీ ఇంకా వివక్షత కొనసాగుతుందని జిల్లా జడ్జి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ బి పాపిరెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో న్యాయ సేవా అధికార సంస్థ, సఖి సంయుక్త ఆధ్వర్యంలో మహిళల చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా న్యాయమూర్తి పాపి రెడ్డి మాట్లాడుతూ మహిళల కోసం అనేక చట్టాలు తీసుకు రావడం జరిగిందన్నారు. చట్టాలపై మహిళలకు అవగాహన ఉండాలన్నారు. ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏడవ అదనపు సెషన్స్ జడ్జి కర్ణ కుమార్, ఐదవ అదనపు సెషన్స్ జడ్జి జె. మైత్రేయి, రెండవ అదనపు సెషన్స్ జడ్జి అనిత, జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ అబ్దుల్ జలీల్ మహిళా, శిశు సంక్షేమ జిల్లా అధికారి పద్మావతి, డీఎస్పీ బాలాజీ, సఖి కేంద్రం ప్రతినిధి, మహిళలు, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.