Breaking News

‘జ్ఞానయుద్ధ భేరి సభ’కు తరలిరండి

‘జ్ఞానయుద్ధ భేరి సభ’కు తరలిరండి

సారథి న్యూస్, కొల్లాపూర్: మార్చి 28న నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్ లో నిర్వహించ తలపెట్టిన స్వేరోస్ జ్ఞానయుద్ధ భేరి సభను జయప్రదం చేయాలని స్వేరోస్​ ఇంటర్​నేషనల్​ నెట్​వర్క్ ​సీనియర్ రిసోర్స్ పర్సన్ డాక్టర్ సోలపోగుల స్వాములు కోరారు. ప్రచారంలో భాగంగా గురువారం పెంట్లవెల్లి మండలం తహసీల్దార్ కిష్టానాయక్, జడ్పీటీసీ చిట్టెమ్మ చేతుల మీదుగా పోస్టర్లు, స్టిక్కర్లను ఆవిష్కరించారు. స్వేరోస్ జ్ఞానయుద్ధభేరి సభ ఉద్దేశం, తమ ఆశయాలు, సిద్ధాంతాలను వివరించారు. సభకు ముఖ్యఅతిథిగా గురుకులాల కార్యదర్శి, రాష్ట్ర అడిషనల్ డీజీపీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరవుతున్నారని తెలిపారు. విద్యారంగంలో తీసుకొస్తున్న విద్యాసంస్కరణలు, గురుకుల పాఠశాలల ఆవశ్యకత, విద్యార్థులు సాధించిన ఘనత, తల్లిదండ్రుల పాత్రను తెలియజేస్తారని డాక్టర్​ సోలపోగుల స్వాములు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు వి.మోహన్, స్వేరోస్ నాయకులు వై.స్వామి, రమణ, సురేందర్, వంగూరు సురేష్, సతీష్, రాజ్ కుమార్, డి.రాజు, కోళ్ల శివకుమార్ పాల్గొన్నారు.

పోస్టర్​ను ఆవిష్కరిస్తున్న పెంట్లవెల్లి మండల తహసీల్దార్ కిష్టానాయక్,