Breaking News

ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​ రెడ్డి వస్తే స్వాగతిస్తా..

ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​ రెడ్డి వస్తే స్వాగతిస్తా..

  • సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారం మానుకోవాలి
  • అక్రమ కేసులను ఎదుర్కొనే సత్తా నాలో ఉంది
  • మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డి

సామజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే స్వాగతిస్తామని మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. రాష్ట్రంలోని 33 జిల్లాలలో 20 జిల్లాలకు పైగా రైతులు అకాలవర్షానికి సతమతమవుతూ ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ నేతలు సమ్మేళనాల పేరుతో రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారని వెంటనే రైతులను ఆదుకునేందుకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఇసుకను అక్రమంగా రవాణా చేయాలంటే ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పార్టీ కండువాను వేసుకోవాలని కండీషన్​ పెడుతున్నారని ఆక్షేపించారు. అలాచేసిన వారికి సంక్షేమ పథకాలను పంపిణీ చేస్తున్నారని పోస్ట్ చేస్తే కేసులు నమోదు చేశారని అన్నారు. మరి తనపై సోషల్ మీడియాలో ఆ పార్టీకి చెందిన అనేకమంది అసత్యపు ప్రచారాలు చేస్తున్నా పోలీసులు వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేల మంత్రుల అవినీతి అక్రమాలను ఆధారాలతో అందిస్తానని, వారిపై చర్య తీసుకునే దమ్ము ముఖ్యమంత్రికి ఉందా? అని ప్రశ్నించారు. కృత్తిమంగా ఇసుకను తయారుచేయడం నేరమని సొంత వ్యవసాయ పొలంలో కూడా ఇసుకను తరలించవద్దని నిబంధన ఉందన్నారు. ప్రతి సంవత్సరం ప్రజాధనంతో ఉద్యోగులకు రూ.5000 కోట్ల జీతాలను చెల్లిస్తున్నారని ఉద్యోగులు మాత్రం అధికారపార్టీకి బానిసలుగా పనిచేస్తూ ప్రజలకు జవాబుదారీగా పనిచేయడం లేదన్నారు. పోలీసుల తీరుపై ఎస్పీ కార్యాలయం ముందు బయట ఇస్తానని హెచ్చరించారు.ప్రజలకు సేవలు అందించడంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. సమావేశంలో నాయకులు అర్థం రవి, బాలాగౌడ్, పాండు లక్ష్మయ్య, నారాయణగౌడ్, అహ్మద్ పాషా, సత్యం, చంటి తదితరులు పాల్గొన్నారు.