Breaking News

మాజీమంత్రి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క

మాజీ మంత్రి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క

సారథి ప్రతినిధి, ములుగు: అనారోగ్యంతో ఇటీవల చనిపోయిన మాజీమంత్రి అజ్మీరా చందూలాల్ ​కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క వారి స్వగ్రామం జగ్గన్నపేట పంచాయతీ సారంగపల్లిలో పరామర్శించారు. ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. చందూలాల్ మరణం ములుగు ప్రాంత ప్రజలకు తీరని లోటన్నారు. మంత్రిగా, ఎంపీగా ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆమె వెంట కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానో త్ రవిచందర్, వెంకటాపూర్ మండలాధ్యక్షుడు చెన్నోజు సూర్యనారాయణ, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్, ములుగు సహకార సంఘం చైర్మన్ బొక్క సత్తిరెడ్డి, కిసాన్ సెల్ జిల్లా ప్రచార కార్యదర్శి నునేటి శ్యాం, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి చక్రపు రాజు, గండ్రత్ విజయకర్ ఉన్నారు.