Breaking News

హరిభూషణ్‌ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క

మావోయిస్టు నేత హరిభూషణ్‌ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క

సారథి, ములుగు: మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ ఆలియాస్ యాప నారాయణ ఇటీవల కరోనాతో మరణించిన విషయం తెలిసిందే. ములుగు జిల్లా గంగారం మండలం మడగూడెం గ్రామంలో హరిభూషణ్ కుటుంబాన్ని ఎమ్మెల్యే సీతక్క గురువారం పరామర్శించారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఆమె వెంట గంగారం, కొత్తగూడ మండలాల ఎంపీపీలు సువర్ణపాక సరోజన జగ్గారావు, విజయ రూపుసింగ్, జడ్పీటీసీలు ఈసం రామ సురేష్ , పుష్పలత శ్రీనువాస్. వైస్ ఎంపీపీ ముడిగా వీరభద్ర పోతయ్య, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు జాడి వెంకటేశ్వర్లు, వజ్జా సారయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకరబోయిన మొగిలి, కోఆప్షన్ సభ్యుడు సయ్యద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజాం సారంగం, బీసీసెల్ నాయకులు వేలుదండి వేణు తదితరులు పాల్గొన్నారు.

హరిభూషణ్​ కుటుంబసభ్యులను ఓదార్చుతున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క