సామాజిక సారథి, హైదరాబాద్: హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలు నమ్మబోరని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దేవుని సతీష్ మాదిగ అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్ నాయకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్రాజు బహిరంగ సవాల్ విసిరారని గుర్తుచేశారు. ఈటల రాజేందర్ గెలిచిన తర్వాత గువ్వల బాల్రాజు రాజీనామా చేయకుండా జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఒకటయ్యాయని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టడం సబబు కాదని, అలాంటివారికి తగిన ప్రజలే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తన పదవికి ఎమ్మెల్యే గువ్వల బాల్ రాజు రాజీనామా చేస్తే అచ్చంపేటలో కాంగ్రెస్ జెండాను ఎగరవేయడం ఖాయమన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ బీజేపీ శ్రేణులను తిట్టి, ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోడీ అమిత్ షా కాళ్లు పట్టుకుంటున్న విషయం ప్రజలు మరిచిపోరని అన్నారు.
- November 4, 2021
- Archive
- ACHAMPET
- GUVVALA
- sathish madiga
- అచ్చంపేట
- గువ్వల
- సతీష్మాదిగ
- Comments Off on ఎమ్మెల్యే గువ్వలపై సతీష్ మాదిగ సంచలన కామెంట్స్