Breaking News

వినాయకుడికి ఎమ్మెల్యే చిరుమర్తి పూజలు

వినాయకుడికి ఎమ్మెల్యే చిరుమర్తి పూజలు

సామాజిక సారథి, నకిరేకల్: నకిరేకల్ పట్టణంలోని పలు వార్డులలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గణపతి మండపాల వద్ద విఘ్నేశ్వరుడికి బుధవారం మొదటిరోజు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా ఆనందంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా వాటిని వినాయకుని దీవెనలతో అధిగమిస్తూ, సకల జన సంక్షేమమే లక్ష్యంగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. నకిరేకల్ నియోజకవర్గ ప్రజలందరికీ ఆ ఏకదంతుడి దీవెనలు అందాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రార్థించారు.