Breaking News

‘మంత్రి నిరంజన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి’

‘మంత్రి నిరంజన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి’

సారథి, చొప్పదండి: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతను కించపరిచేలా మాట్లాడిన వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) కరీంనగర్ ​జిల్లా అధ్యక్షుడు మచ్చ రమేష్ ముఖ్యమంత్రి కేసీఆర్​ను డిమాండ్ చేశారు. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ఉపాధి ఉద్యోగం అవకాశాల్లేక కుటుంబాలకు భారమై యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ తరుణంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఉపాధి కోసం గ్రామాల్లో హమాలీ పనులు చేసుకోవాలని వ్యాఖ్యానించడం దుర్మార్గమని ఖండించారు. స్వరాష్ట్రం వచ్చి ఏడేళ్లు గడుస్తున్నా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ వారి త్యాగాలను అవమానపరుస్తూ అధికారమదంతో మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. యువతకు భరోసా కల్పించాల్సిన మంత్రులు కూలీ పనిచేసుకోవాలని మాట్లాడి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతిస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని కోరారు.