Breaking News

అట్టహాసంగా మంత్రి హరీశ్ రావు జన్మదిన వేడుకలు

అట్టహాసంగా మంత్రి హరీశ్ రావు జన్మదిన వేడుకలు

సారథి: పెద్దశంకరంపేట: ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు జన్మదిన వేడుకలను పెద్దశంకరంపేట ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ జంగం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అపరచాణిక్యుడు, కార్యదక్షుడు, ట్రబుల్ షూటర్ గా పేరొందిన మంత్రి హరీశ్ రావు తెలంగాణ రాష్ట్రానికే తలమానికం అన్నారు. హరీశ్ రావు లాంటి నేత తెలంగాణలో పుట్టడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో ఆయన పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రసాధనలో ఆయన తనవంతు పాత్ర పోషించారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు, వైస్ ఎంపీపీ లక్ష్మి, రైతుబంధు మండలాధ్యక్షుడు సురేష్ గౌడ్, ఎంపీటీసీలు వీణాసుభాష్ గౌడ్, దత్తు, దామోదర్, రాజు పాల్గొన్నారు.