సారథి న్యూస్, రామగుండం: తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా సింగరేణి యాజమాన్యం ఈనెల 17తేదీన ఒక్కరోజునే రెండులక్షలకు పైగా మొక్కలను సింగరేణివ్యాప్తంగా నాటాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ఏరియాల్లో దీనికోసం సన్నాహాలు చేస్తున్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్(ఆపరేషన్స్,పా) కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో ఎన్.బలరాం(ఫైనాన్స్, పీ అండ్ పీ) భూపాలపల్లి ఏరియాలో డి.సత్యనారాయణరావు(ఈఎం) రామగుండం-1 ఏరియాలో పాల్గొననున్నారు. కరోనా జాగ్రత్తలను కచ్చితంగా పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యాజమాన్యం కోరింది.
- February 13, 2021
- Top News
- HARITHAHARAM
- RAMAGUNDAM
- SINGARENI
- భూపాలపల్లి
- రామగుండం
- సింగరేణి
- హరితహారం
- Comments Off on 17న సామూహిక హరితహారం