మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ఏటపల్లి తాలూకా గట్టా పోలీస్ స్టేషన్ పై బుధవారం అర్ధరాత్రి మావోయిస్టులు రాకెట్ లాంచర్ తో దాడిచేశారు. గోడకు తగలడంతో పెద్ద రంధ్రం పడింది. హ్యాండ్ మేడ్ రాకెట్ లాంచర్ గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు ఆరాతీస్తున్నారు. ఈ దాడిలో ప్రమాదం జరగకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. డ్రోన్ కెమెరాలతో అడవిలో మావోయిస్టులపై దాడి చేస్తున్నారని ఆరోపణలు చేసిన కొన్నిగంటల వ్యవధిలోనే లాంచర్ తో ఠాణాపై దాడికి పాల్పడడం గమనార్హం. డ్రోన్ బాంబులకు ప్రతీకారంగా దాడి చేసినట్లు తెలిసింది.
- April 23, 2021
- Archive
- Top News
- MAHARASTRA
- MAOIST
- rocket lanchur
- గడ్చిరోలి
- మహారాష్ట్ర
- మావోయిస్టులు
- రాకెట్ లాంచర్
- Comments Off on దాడుల్లో పంథా మారిందా?