సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయలను పదిమందికి చేరవేయడమే తమ ముఖ్య ఉద్దేశమని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షురాలు పట్లోళ్ల మల్లిక అశోక్ అన్నారు.మెదక్ జిల్లా నిజాంపేట మండలకేంద్రంలోని వ్యవసాయ సబ్ మార్కెట్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు తెలంగాణ జాగృతిలో చేరారు. తెలంగాణ పండుగలను ప్రపంచం నలుమూలలకు తెలియజేయడంలో మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కవిత ఎనలేని కృషిచేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కన్వీనర్ శేఖర్, నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, చల్మేడ సర్పంచ్ నరసింహారెడ్డి పాల్గొన్నారు.
- February 3, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CM KCR
- KAVITHA
- RAMAYAMPET
- TELANGANA JAGRUTHI
- కవిత
- తెలంగాణ జాగృతి
- రామాయంపేట
- సీఎం కేసీఆర్
- Comments Off on తెలంగాణ జాగృతిలో పలువురి చేరిక