సామాజికసారథి, సిద్దిపేట: మల్లన్న మాడ వీధులు భక్తి పారవశ్యంతో మునిగిపోయాయి. ఎక్కడ చూసినా అంతా పసుపుబండారు మయంగా మారింది. శివసత్తుల సిగాలు, డమరుక నాథాలు పోతారాజుల విన్యాసాలు, డోలు చప్పుళ్లతో మల్లన్న ఆలయానికి భక్తులు బారులు తీరారు. సంక్రాంతి నుంచి ఉగాది వరకూ ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. శనివారం వేకువజామునుంచి ఆదివారం రాత్రి వరకూ సుమారు 50యాభైవేల మంది దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి క్యూ లైన్ లో ఐదు గంటల సమయం పట్టింది. అనంతరం కొండ పైన ఎల్లమ్మ పోచమ్మలకు నైవేధ్యం సమర్పించారు. ఆలయ చైర్మన్ గిస భిక్షపతి, ఈఓ బాలాజీ భక్తులకు ఏర్పాట్లు చేయగా, పోలీసులు బందోబస్తు నిర్వహించారు
- January 17, 2022
- Archive
- Top News
- లోకల్ న్యూస్
- Comments Off on భక్తి పారవశ్యంతో మల్లన్న బ్రహ్మోత్సవాలు