Breaking News

నల్లమట్టిపై అధికారం మాదే

నల్లమట్టిపై అధికారం మాదే

  • మాకు తెలియకుండా ఎలా అమ్ముకుంటారు
  • వర్గాలుగా విడిపోయి లీడర్ల పంచాయతీ
  • వాటాల లొల్లిపై ఎమ్మెల్యే సీరియస్

సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: జిల్లాలోని బిజినేపల్లి మండలం కేంద్రంలో ఉన్న చాకలివాని చెరువు నల్లమట్టి పంచాయితీ మండలంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఒక్కసారిగా వర్గవిభేదాలు రచ్చకెక్కాయి. లీడర్ల మధ్య పంచాయితీ రోజురోజుకు కాసింత పెరుగుతూ వస్తోంది. రెండురోజుల క్రితం ‘మట్టిపాలిటిక్స్’ శీర్షికన ‘సామాజిక సారథి’ దినపత్రికలో ప్రచురితమైన కథనంతో జిల్లా అధికారులతో పాటు స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి కూడా స్పందించి లీడర్లకు పంచాయితీ పెంచుకోవాలని హుకుం జారీచేశారు. నల్లమట్టి పంచాయతీ వల్ల జిల్లాలో పార్టీ పరువు పోతుందని గట్టిగా ఆదేశాలు జారీచేయడంతో తాజాగా శుక్రవారం వర్గాలుగా విడిపోయిన నాయకులు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ వద్ద ఎవరివాటా ఏమిటో తెలుసుకోవడానికి ఒక చిన్న సమావేశం ఏర్పాటుచేశారు. ఇది కూడా హాట్ హాట్ గా సాగడంతో వర్గవిభేదాలు మరింత తీవ్రమయ్యాయి.

ఎవరి వాదన వారిదే
మూడు వర్గాలుగా విడిపోయిన నాయకులు రైతులు తాము పంట సాగు చేసుకుంటున్నామని, తమకు తెలియకుండా చెరువులోని నీటిని మోటార్ల సహాయంతో ఎలా బయటకి పంపిస్తారని యాసంగి సీజన్ లో తమకు నీళ్లు ఎలా? అని ప్రశ్నించారు. మరోవైపు మత్స్య సహకార సంఘం నాయకులు చెరువులో ఉన్న చేపలకు నీరు లేకుండా నీటిని ఎలా బయటికి తిడతారని చెరువుపై హక్కు తమ సంఘానికి ఉంటుందని ప్రశ్నించారు. ఇంకోవైపు ప్రజాప్రతినిధులు ఈ విషయంలోకి తరబడి తమకు తెలియకుండా చెరువులోని నల్లమట్టిని ఎలా అనుకుంటారని, తమ వాటాను ఇవ్వకుండా నల్లమట్టి అమ్ముకోవడం ఏమిటని ఎవరి వాదన వారు గట్టిగా వినిపించారు. దీంతో అది చూడడానికి వచ్చారు. చుట్టుపక్కల ప్రజలు నాయకులు ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా పోయి ఇలా మట్టి అమ్ముకుంటూ వాటాల కోసం కొట్లాడుకోవడం ఏమిటని నవ్వుకుంటూ వెళ్లిపోయారు. దీంతో వాటాలు చెల్లించిన కంపెనీ అధికారులు తాము నష్టపోతున్నామని వాపోతున్నారు.