సారథి న్యూస్, మానవపాడు: మండలంలో నిర్వహించిన పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతమైందని జిల్లా పోగ్రాం అధికారి డాక్టర్ సౌజన్య అన్నారు. మానవపాడు మండలంలో 4,892 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశామని వివరించారు. మండలం పరిధిలో 33 పోల్స్ పోలియో బూత్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ఒక మొబైల్ టీమ్ ద్వారా పోలియో చుక్కలను వేశామన్నారు. రెండురోజుల పాటు ఇంటింటికీ తిరిగి చుక్కల మందు వేస్తామని తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ అధికారులు చంద్రన్న సత్యనారాయణ, సంధ్యారాణి, తిరుమల్, ఆరోగ్యశ్రీ ప్రసాద్, స్టాఫ్ నర్స్ మహాలక్ష్మి, ఆయా గ్రామాల ఏఎన్ఎంలు, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
చుక్కల మందు వేసిన జడ్పీచైర్‌పర్సన్
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో పలువురు చిన్నారులకు జడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కలెక్టర్ శృతిఓజా, మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, డీఎంహెచ్‌వో చందు నాయక్ ఉన్నారు.