- ముదిరాజ్ సంఘం జిల్లా యువ నాయకుడు హరికృష్ణ
సారథి, బిజినేపల్లి: మాజీమంత్రి, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్ కు తెలంగాణ ముదిరాజ్ మహాసభ అండగా నిలుస్తుందని సంఘం జిల్లా నాయకులు హరికృష్ణ ముదిరాజ్ తెలిపారు. గురువారం తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాగర్ కర్నూల్ యువజన విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఈటలను కలిశారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ ను కక్ష సాధింపుతో మంత్రివర్గం నుంచి తొలగించారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముదిరాజ్ కులస్తులను, బీసీ సామాజికవర్గాన్ని ఏకం చేయడంతో పాటు సబ్బండవర్గాలను ఉద్యమం వైపు తీసుకెళ్లడంలో ఈటల ఎంతో కృషిచేశారని కొనియాడారు. కార్యక్రమంలో బీసీ సంఘం బిజినేపల్లి మండలాధ్యక్షుడు సిద్ధుల శివ ముదిరాజ్, ముదిరాజ్ యువజన విభాగం బిజినేపల్లి మండలాధ్యక్షుడు ఈశ్వర్, రమేష్, బీసీ సంఘం మండల ఉపాధ్యక్షుడు శరత్ సాగర్, శివ పాల్గొన్నారు.