సారథి న్యూస్, ములుగు: మతిస్థిమితం కోల్పోయిన నిరాశ్రయులను ఆదరించాలని ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ పిలుపునిచ్చారు. నాలుగు రోజుల క్రితం మల్లంపల్లిలో ఓ అనాథ వృద్ధుడికి తస్లీమా స్వయంగా అన్నం తినిపించిన విషయం విదితమే. శనివారం ఆమె ఆఫీసుకు బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో ఓ వృద్ధుడు చిరిగిన బట్టలు, మాసిన గడ్డం, జుట్టుతో చలనం లేకుండా పడుకుని ఉండడం చూసి ఆమె చలించిపోయారు. క్షవరం చేయించి తానే స్వయంగా స్నానం చేయించారు. కొత్త బట్టలు కొనిచ్చి అన్నం పెట్టారు. తన పేరు లాల్ సాహెబ్ గా అతడు చెప్పాడు. కరోనా సమయంలో చాలా మంది ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఇలా మారారని అన్నారు.
- March 6, 2021
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- MALLAMPALLY
- MULUGU
- మల్లంపల్లి
- ములుగు
- స్వచ్ఛందసేవ
- Comments Off on నిరాశ్రయులను ఆదరిద్దాం