Breaking News

అడవులను కాపాడుకుందాం..

అడవులను కాపాడుకుందాం..

సారథి, ములుగు: అడవులను కాపాడుకుందామని ములుగు జిల్లా కలెక్టర్​ ఎస్.కృష్ణఆదిత్య పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రకృతి వనాల్లో మొక్కల సర్వేవాల్ రేటు పెంచేలా చూడాలని సూచించారు. హరితహారం మొక్కలను రెడీ చేయాలన్నారు. కోరిన విధంగా ఇంటింటికీ ఆరు మొక్కలు ఇవ్వాలన్నారు. నాటిన ప్రతిమొక్కకు జియో ట్యాగ్ తప్పనిసరి సూచించారు. రైతుల అభీష్టం మేరకు ఆయిల్ ఫామ్, మామిడి ఫామ్ మొక్కలను ఇచ్చేందుకు ప్లాన్ చేయాలని కోరారు.

కంటైన్​మెంట్ల జోన్లలో నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. జిల్లా ఫారెస్ట్ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి మాట్లాడుతూ ఫారెస్ట్, రెవెన్యు అధికారులు పరస్పర సహకారంతో పనులు చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ ఆదర్శసురభి మాట్లాడుతూ కరోనా నియంత్రణలో బాగంగా మస్క్ ధరించని వారికి రూ.వెయ్యి ఫైన్ వేసే అధికారం పంచాయతీ సెక్రటరీకి ఉందని, కరోనా నుంచి ప్రజలను కాపాడాలన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో హన్మంతు కె జడంగే, డీఆర్​వో రమాదేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.