Breaking News

భూసారం పెంచుదాం

భూసారం పెంచుదాం

సారథి న్యూస్, మానవపాడు: సేంద్రియ ఎరువుల వాడకంతో భూసారం పెరుగుతుందని వ్యవసాయ సంచాలకుడు సక్రియ నాయక్ రైతులకు సూచించారు. శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పెద్దఆముదాలపాడు గ్రామంలో ‘భూసార పరీక్ష.. సుస్థిర వ్యవసాయం’పై అలంపూర్​డివిజన్ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. భావితరాలకు అవసరమైన భూములను అందిద్దామని పిలుపునిచ్చారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించాలన్నారు. ప్రతి గ్రామంలో భూసార పరీక్షలు తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మానవపాడు మండల వ్యవసాయాధికారి శ్వేత, ఆత్మ సిబ్బంది శ్రీధర్, శ్రీకాంత్, సర్పంచ్ నారాయణ, ఏఈవోలు దశరథ రామయ్య, మణిప్రకాష్, లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు.

పంటను పరిశీలిస్తున్న వ్యవసాయశాఖ అధికారులు