సారథి, ములుగు: కరోనా వైరస్ ను తరిమికొట్టడానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఉంటూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ కోరారు. శుక్రవారం ములుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వెలుపల శానిటైజర్ హ్యాండ్ వాష్ ను ఏర్పాటుచేశారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజలకు కరోనా మహమ్మారి గురించి అవగాహన కల్పించారు. కార్యాలయానికి వచ్చే ప్రతిఒక్కరూ చేతులు శుభ్రంగా కడుక్కొని లోపలికి రావాలని చూచించారు. ఆఫీసులో మాస్కు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ, ఆఫీసు సిబ్బందికి సహకరించాలని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ కోరారు.
- April 23, 2021
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- షార్ట్ న్యూస్
- CARONA
- MULUGU
- TASLIMA
- కరోనా
- ములుగు
- సబ్ రిజిస్ట్రార్ తస్లీమా
- Comments Off on కరోనాను తరిమికొడదాం