Breaking News

భూసేకరణ నిలిపివేయండి

భూసేకరణ నిలిపివేయాలి

సారథి, రామడుగు: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగమైన కరీంనగర్​జిల్లా రామడుగు మండలంలోని గాయత్రి పంపు హౌస్ నుంచి మిడ్ మానేరుకు అదనంగా మూడవ టీఎంసీ జలాల తరలింపునకు చేపట్టబోయే నూతన కాల్వ భూసేకరణను నిలిపివేయాలని శానగర్ గ్రామస్తులు అభ్యంతరం చెప్పారు. ఈ మేరకు గురువారం తహసీల్దార్​ కోమల్​రెడ్డికి వినతిపత్రం అందజేశారు. గతంలో నిర్మించిన వరద కాల్వ భూసేకరణలో చాలా మంది రైతులు తమ విలువైన భూముల కోల్పోయారని, ఇప్పుడు రెండవ, మూడవ సారి ఇండ్లు, భూములను కోల్పోయి రోడ్డునపడే అవకాశం ఉందన్నారు. కాల్వ నిర్మాణానికి తమ భూములను ఇవ్వబోమని, ప్రత్యామ్నాయంగా మరోచోట భూసేకరణ చేయాలని ఆ వినతిపత్రంలో కోరారు.