సారథి, రామడుగు: రామడుగు మండల కేంద్రంలో శ్రీరామాంజనేయ ఆటో యూనియన్ ను బుధవారం ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా పెసరి కనకరాజు ఎన్నిక కాగా, అధ్యక్షుడిగా రెండవ సారి ఉత్తెం కుమార్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా చందా అనిల్, ప్రధాన కార్యదర్శిగా జంగిలి శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా ఉత్తేం దేవరాజు, కోశాధికారిగా చంటిబాబు, రైటర్ గా అనుపురం మల్లేశం, సలహాదారుగా కర్నె శ్రీను, పంజాల శ్రీనివాస్, కార్యవర్గసభ్యులుగా ఉత్తెం మల్లేశం, ఉత్తెం సాగర్, గాదం మహేష్, మామిడి రాజు, బుత్కురి శంకర్, నీలం శ్రీనివాస్ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ యూనియన్ బలోపేతం, హక్కుల సాధనకు కృషిచేస్తానని స్పష్టం చేశారు. ఆటో యూనియన్ పాలకవర్గ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
- August 4, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- auto union
- RAMADUGU
- ఆటో యూనియన్
- రామడుగు
- Comments Off on ఆటో యూనియన్ అధ్యక్షుడిగా కుమార్