Breaking News

సేవాగుణం.. దానమే భూషణం

దానమే వారి ఆభరణం
  • ప్రజాసేవలో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​రెడ్డి ఫ్యామిలీ
  • కంటి ఆస్పత్రి, విద్యాసంస్థలకు భూదానం
  • తల్లి కొండమ్మ పేర పేదలకు కళ్యాణ మండపం
  • నేడు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: ఆ కుటుంబమంటే ఊరిలో అందరికీ గౌరవం. సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంది పేదలను ఆదుకున్నారు. దానధర్మాలు చేయడంలో పెట్టింది పేరు. గ్రామంలోనే కాకుండా నాగర్​కర్నూల్​నియోజకవర్గంలో కూడా ఎన్నో ప్రజా అవసరాలకు సహాయ సహకారాలు అందజేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు మండలిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి. గ్రామంలో పేదల వివాహ, శుభకార్యాలు చేసుకునేందుకు ఉచితంగా ఇచ్చేందుకు లక్షల రూపాయలు వెచ్చించి పెద్దఎత్తున కళ్యాణ మండపం నిర్మించారు. శనివారం ప్రారంభోత్సవం చేయనున్నారు. నాగర్​కర్నూల్​జిల్లా తుడుకుర్తి గ్రామంలో సర్పంచ్ స్థాయి నుంచి ప్రభుత్వ విప్ స్థాయికి ఎదిగిన ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఎంతో ఆదర్శంగా సాగింది. పుట్టిన ఊరుకు సేవలు అందిస్తూ తన అమ్మానాన్నలు, కుటుంబసభ్యుల పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇలా తన పేరును చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకున్నారు.

ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​రెడ్డి
డాక్టర్​ కూచకుళ్ల రాజేశ్​ రెడ్డి


సేవా కార్యక్రమాలు
నాగర్ కర్నూల్ మండలం తుడుకుర్తి గ్రామంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి నిర్మాణానికి తన తండ్రి కూచకుళ్ల రామచంద్రారెడ్డి పేర కొన్నేళ్ల క్రితం 10 ఎకరాల స్థలాన్ని దానం చేశారు. గ్రామపంచాయతీ, వెటర్నరీ ఆస్పత్రులకు సొంతంగా స్థలం ఇచ్చారు. గ్రామంలో ఉన్న ప్రభుత్వ భవనాలు దాదాపుగా వారి ఇచ్చిన దానం చేసిన స్థలాల్లో నిర్మించినవే ఉన్నాయి. ఆయన తన సతీమణి పేర భాగ్యనగర్ ఒక కాలనీ నిర్మించి 80 వరకు ఇళ్లను పేదలకు ఉచితంగా నిర్మించి ఇచ్చారు. గ్రామంలో 400 మంది పేదలకు ఇళ్లస్థలాలు అందజేసి అందులో అవసరం ఉన్నవారికి తన సొంత ఖర్చుతో ఇళ్ల కట్టించి ఇచ్చారు. రాంరెడ్డి పల్లి తండాలో 5 ఎకరాలు ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చారు. నిర్మాణానికి రూ.10లక్షలు ఇచ్చారు. తాజాగా ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​రెడ్డి తన తల్లి కూచకుళ్ల కొండమ్మ స్మారకార్థం పేదలు ఖర్చు లేకుండా పెళ్లిళ్లు చేసుకునేలా తుడుకుర్తిలో సుమారు ఎకరా స్థలం విస్తీర్ణంలో కళ్యాణ మండపం నిర్మించారు. దీనికి ఉగాది సందర్భంగా శనివారం ప్రారంభించనున్నారు. అలాగే ఇటీవల లక్షల రూపాయల వ్యయంతో సీసీరోడ్లను వేశారు.

ఇటీవల నిర్మించ సీసీ రోడ్డు