Breaking News

అతనితో ఏడేళ్లుగా అఫైర్​

టాలీవుడ్​ చందమామ కాజల్​ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. గౌతమ్​ అనే వ్యాపారవేత్తను ఈ ముద్దుగమ్మ పెళ్లాడబోతున్నది. అయితే తమది ప్రేమ పెళ్లి అని ఇదివరకే ఈ జంట ప్రకటించింది. గౌతమ్​తో కాజల్​ దాదాపు ఏడేండ్ల పాటు అఫైర్​ నడిపినట్టు సమాచారం. మీడియా కంటపడకుండా ఈ జంట చాలా రహస్యంగా ప్రేమవ్యవహారం నడిపిందట. మరోవైపు కాజల్‌ను పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరంటూ నెటిజన్లు గూగుల్​లో తెగ వెతుకుతున్నారట. వాళ్లిద్దరూ చాలా క్లోజ్‌గా ఉన్న కూడా ఫొటోలు చాలా బయటపడ్డాయి. గౌతమ్​ కాజల్​ చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్​ చదివారని సమాచారం. అయితే ఇంటీరియర్​ డిజైనర్​గా పనిచేస్తున్న గౌతమ్​.. ఇప్పటికే కాజల్​తో కలిసి బ్యాంకాక్​, సింగపూర్​ వంటి దేశాలను చుట్టేశాడట. గౌతమ్‌ ‘డిసెర్న్‌ లివింగ్‌’ అనే ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తున్నాడు.