- టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి
- జైపాల్‌రెడ్డి లేనిలోటు తీరనిదని : వీహెచ్
సామాజిక సారథి, హైదరాబాద్ : రాజకీయ విలువలు కాపాడిన వ్యక్తుల్లో ఎస్ జైపాల్ రెడ్డి ఒకరని, దేశానికి వన్నె తెచ్చే నిర్ణయాలు ఆయన తీసుకున్నారని టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి అన్నారు. ఆదివారం నెక్లెస్ రోడ్‌లోని జైపాల్ రెడ్డి ఘాట్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి దంపతులు జైపాల్‌రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి లేకపోయినా ఆయన సాధించిన తెలంగాణలో మనం ఉన్నామన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్‌లో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన జరగడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఆయన ఆశయాలు నెరవేరతాయన్నారు. రాజకీయాలు అంటే పార్టీ ఫిరాయింపులు, కొనుగోళ్లు, కాంట్రాక్టులుగా సీఎం కేసీఆర్ చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్సీనియర్నేత కేంద్ర వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌కు మాజీమంత్రి జైపాల్‌రెడ్డి లేనిలోటు తీరనిదని తెలిపారు. ఆయన కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. జైపాల్‌రెడ్డి నిత్యం పార్టీ, దేశం కోసం ఆలోచించే వారని, రాష్ట్రంలో ఓ ప్రాజెక్టుకు జైపాల్‌రెడ్డి పేరు పెట్టాలని వీహెచ్ డిమాండ్ చేశారు.