Breaking News

కులాలుగా విభజించి పనులు చేయడం సరికాదు

కులాలుగా విభజించి పనులు చేయడం సరికాదు

సారథి, బిజినేపల్లి: ఉపాధిహామీ చట్టం ద్వారా ఉపాధి పొందుతున్న కూలీలను కులాల వారీగా విభజించి పనులు చేయించడం సరికాదని, సంబంధిత జీవోను వెంటనే రద్దుచేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్)​జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పనుల కోసం ఎస్సీ, ఎస్టీ సబ్​ప్లాన్​నిధులను ఖర్చుచేయడం సరికాదన్నారు. గురువారం బిజినేపల్లి తహసీల్దార్​ ఆఫీసు ఎదుట కేవీపీఎస్ ​ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2005లో నాటి ప్రభుత్వం కులాలు, మతాలకతీతంగా వందరోజుల పని గ్యారెంటీగా కల్పించాలని, సమాన వేతనాలు అమలు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూలీలను కులాల వారీగా విభజించి సబ్​ప్లాన్​ నిధులను ఖర్చుచేయాలని చూడటం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. అనంతరం తహసీల్దార్​ అంజన్​రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) మండల కన్వీనర్ హనుమంతు, ప్రసాద్, అడ్వకేట్ బోనాసి రామకృష్ణ, సీఐటీయూ జిల్లా నాయకులు బోనాసి సుధాకర్, కృష్ణ, రాములు పాల్గొన్నారు.