యాక్టర్ సుహాస్ హీరోగా వస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘రైటర్ పద్మభూషణ్. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి. మనోహర్ సమర్పిస్తున్నారు. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్‌తో మూవీ విశేషాలు..
సుహాస్‌తో షార్ట్ ఫిల్మ్ నుంచి పరిచయం. ‘కలర్ ఫోటో’కి సహాయ దర్శకుడిగా పని చేశాను. అదిసెట్ పై ఉండగానే ఫ్యామిలీ డ్రామాకి రచయితగా అవకాశం వచ్చింది. ఇది ఫ్యామిలీ మూవీ అని మొదటి నుండి చెబుతున్నాం. అలా అని వేడుకలు, చుట్టాలు, బంధువులు, మెలో డ్రామాలా వుండదు. ఇది మన ఇంట్లో జరిగే కథ. ప్రతి పాత్రలో అల్లరి వుంటుంది. ఇదో హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఇందులో హీరో లైబ్రేరియన్. రచయితే అన్నిటికి మూలం. ఎంత బడ్జెట్ పెట్టినా మొదట కంటెంట్ రాయాల్సింది రచయితనే. అలాంటి ఒక రచయిత జర్నీ ఇందులో వుంటుంది. ఇందులో హీరో పాత్ర పేరు పద్మభూషణ్. తను ఒక రైటర్ కావాలని అనుకుంటాడు. మరి రచయిత అయ్యాడా లేదా తన ప్రయాణం ఎలా సాగింది .. అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. నాకు కామెడీ చాలా ఇష్ట, నా బలం కూడా అదే. ఇందులో చాలా మంచి హ్యుమర్ వుంటుంది. ఈవివి, జంధ్యాల, శ్రీనువైట్ల గారి సినిమాలు నాకు చాలా ఇష్టం. ఆశిష్ విద్యార్ధి, రోహిణి గారు, గోపరాజు రమణ గారు ఇలా చాలా మంచి నటులు ఉన్నారు ఇందులో. హీరోయిన్ శిల్పా రాజ్ ఓటీటీ స్టార్. అలాగే గౌరీ ప్రియ చాలా అద్భుతంగా చేశారు. నిర్మాతలు అద్భుతంగా సహకరించారు. కొన్ని కథలు వున్నాయి. ఒక ప్రాజెక్ట్ చర్చల దశలో వుంది.
- January 25, 2023
- Archive
- CINEMA GALLERY
- సినిమా
- Andhra Pradesh
- Cinema
- తెలంగాణ
- Comments Off on ఇది పక్క ఫ్యామిలీ ఎంటర్ టైనర్