హీరోయిన్ కీర్తి సురేష్ వివాహంపై కొత్త చర్చ ఒకటి మొదలయ్యింది. ఆమె తన చిన్ననాటి స్నేహితుడైన ఓ వ్యాపారవేత్తతో రిలేషన్ షిప్ లో ఉందని, నాలుగేళ్ల తర్వాత వీరు పెళ్లి చేసుకోబోతున్నారనేది తాజాగా ప్రచారమవుతున్న సమాచారం. కీర్తి సురేష్ స్నేహితుడికి కేరళలో వ్యాపారాలు ఉన్నట్టు తెలుస్తోంది. కోలీవుడ్ మ్యూజిక్ కంపోజర్తో కీర్తి ప్రేమలో ఉన్నట్టు గతంలో ప్రచారం జరిగింది. దాన్ని ఆమె కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. అనంతరం వ్యాపారవేత్తతో ఆమె వివాహం కుదిరినట్టు ప్రచారం జరిగింది. ఇలా ఒకదాని వెంట ఒకటి ఆమె పెళ్లికి సంబంధించి కల్పిత కథనాలు, ఊహాగానాలు స్ప్రెడ్ అవుతున్నాయి. కానీ దీనిపై ఇంతవరక కీర్తి స్పందించలేదు. ఈ ప్రచారంలో నిజం ఎంతన్నది ఆమె స్వయంగా చెబితేనే తెలుస్తుంది.
- January 26, 2023
- Archive
- CINEMA GALLERY
- సినిమా
- Cinema
- Comments Off on ఇది నిజమేనా కీర్తి..?