సారథి, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని బల్మూ ర్, కొండనాగుల, రామాజిపల్లి గ్రామాల్లోని సీడ్ డీలర్ షాపులను మండల వ్యవసాయాధికారి మహేష్ కుమార్, ఇన్ చార్జ్ సబ్ ఇన్ స్పెక్టర్ కృష్ణయ్య మంగళవారం తనిఖీచేశారు. డీలర్లు ప్రభుత్వ గుర్తింపు పొందిన కంపెనీ విత్తనాలను మాత్రమే అమ్మాలని, లూజ్ సీడ్స్ ను అమ్మకూడదని, కొనుగోలు చేసే రైతుకు రసీదు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. షాపు బయట ధరలపట్టిక, స్టాక్ బోర్డు ఉంచాలని ఆదేశించారు.
నకిలీ సీడ్ అమ్మితే షాపులు సీజ్
సారథి, రామాయంపేట: రైతులకు నకిలీ సీడ్స్ అమ్మితే చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా రామాయంపేట ఏడీఏ వసంత సుగుణ, నిజాంపేట ఎస్సై ప్రకాష్ గౌడ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులు, పెస్టిసైడ్, సీడ్ షాపులను తనిఖీచేశారు. షాపు లైసెన్స్ కలిగి ఉండాలని, విత్తనాలు, ధరల పట్టికను షాపు ముందు ఏర్పాటుచేయాలని డీలర్లకు సూచించారు. ఊళ్లలో ఎలాంటి లైసెన్సులు లేకుండా సీడ్ ను అమ్మకూడదని సూచించారు.