సామాజిక సారథి, వైరా/ఏన్కూరు: నియోజకవర్గ కేంద్రమైన వైరాలోని తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలికల పాఠశాలతోపాటు ఏన్కూరులోని గురుకుల బాలుర పాఠశాలలను ఆ విద్యాలయాల సంస్థ రాష్ట్ర సెక్రెటరీ రమణ కుమార్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాలతి, ఖమ్మం డీఆర్వో శిరీష, డీఈఓ యాదయ్య, బుధవారం సందర్శించి పరిశీలించారు. ఇటీవల వైరాలోని గురుకుల బాలికల పాఠశాలలో 29మంది విద్యార్థులు కరోనా బారిన పడిన నేపథ్యంలో స్వయంగా రాష్ట్ర సెక్రెటరీ జిల్లా అధికారులతో కలిసి సందర్శించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎంఈఓ జయరాజు, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి, సూపరింటెండెంట్ అశోక్ పాల్గొన్నారు.
- November 25, 2021
- Archive
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- Enkoor
- Gurukul
- INSPECTION
- SCHOOLS
- Secretary
- ఏన్కూరు
- గురుకుల
- తనిఖీ
- సెక్రెటరీ
- స్కూల్స్
- Comments Off on ఏన్కూరులో గురుకులాల తనిఖీ