సామాజిక సారథి, జడ్చర్ల: మండలంలో ఇటుక బట్టీల యజమానితో చిత్రహింసలకు గురవుతున్నారని ఒడిశా వలస కూలీల ఘటనపై జిల్లా అధికారుల ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు అప్రమత్తమై విచారణ చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం దేవుడి గుట్ట సమీపంలో ఇరవైరోజుల క్రితం మాధవరావు అనే కాంట్రాక్టర్ ఇటుక బట్టీలను తయారు చేసేందుకు ఒడిశా రాష్ట్రం నుంచి ఓ మధ్యవర్తి ద్వారా సుమారు 13మంది వలస కూలీలను తీసుకొచ్చారు. ఓ వలసకూలీ తమను ఇటుక బట్టీల కాంట్రాక్టర్ చిత్రహింసలకు గురి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. స్పందించిన జిల్లా అధికార యంత్రాంగం ఆదేశాల మేరకు స్థానిక తహసీల్దార్, పోలీసులు బుధవారం గుట్ట సమీపంలో ఇటుక బట్టీలు తయారు చేసేలా కూలీల వద్దకు వెళ్లి విచారణ చేశారు. తహసీల్దార్ ను వివరణ కోరగా ట్విట్టర్ లో పేర్కొన్న దానిపై విచారణ చేపట్టగా ప్రత్యక్షంగా ఇక్కడ ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు లేవని వలస కూలీలు చెప్పారని తహసీల్దార్ లక్ష్మీ నారాయణ, ఎస్ఐ షంషుద్దీన్ తెలిపారు,
- December 2, 2021
- Archive
- లోకల్ న్యూస్
- IMMIGRATION
- Investigation
- Judiciary
- ODISHA
- POLICE
- WORKERS
- ఒడిషా
- కూలీలు
- జడ్చర్ల
- పోలీసులు
- వలస
- విచారణ
- Comments Off on ఒడిషా వలసకూలీలపై విచారణ