సామాజికసారథి, హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ హైదరాబాద్ టోలిచౌకిలోని తన నివాసంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొక్క నాటారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో మొక్క నాటి స్వాగతం పలకడం ఆనందంగా ఉందని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. ప్రతిఒక్కరూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అలాగే తమ జన్మదినాన్ని పురస్కరించుకుని టీఎస్‌ఎస్ జీడీసీ చైర్మన్ డాక్టర్దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ మొక్కలు నాటారు.
- January 2, 2022
- Archive
- Comments Off on కొత్త ఏడాదికి వినూత్న స్వాగతం