సారథి, రామడుగు: దేశ ఆర్థిక వ్యవస్థను కుదేల్ చేసిన కరోనాకు వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచిందని కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కొనియాడారు. సుమారు 50 దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ చేస్తూ ప్రపంచానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. ఏప్రిల్3,4 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే మండలస్థాయి రాజకీయ శిక్షణ తరగతుల కార్యక్రమాలను శనివారం పరిశీలించిన అనంతరం ఆయన స్థానిక ఆర్యవైశ్య భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ శిక్షణ కార్యక్రమంలో బూత్ స్థాయి కార్యకర్తల నుంచి ఉన్నతశ్రేణి నాయకుల పాల్గొంటారని తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవడానికి 80 కోట్ల మందికి ఉచితంగా ఆహారపదార్థలు అందించడం, ఆత్మ నిర్భర్భారత్ పేరున రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించి ఆదుకున్నారని గుర్తుచేశారు.
వందే భారత్ మిషన్ ద్వారా దాదాపు 47 లక్షల విదేశీ వలస కార్మికులను తీసుకురావడం వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. ఏప్రిల్ ఒకటి నుంచి 45 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మేకల ప్రభాకర్ యాదవ్, సాయిని మల్లేశం, మండలాధ్యక్షుడు ఒంటెల కర్ణాకర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ జిన్నారం విద్యాసాగర్, చొప్పదండి టౌన్ ప్రెసిడెంట్ రాజన్నల రాజు, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, గంగిడి నర్సింహారెడ్డి, గంగాధర మాజీ ఎంపీటీసీ పెరుకు శ్రావణ్, మాజీ మండలాధ్యక్షుడు ఉప్పు రాం కిషన్, ఓబీసీ రాష్ట్ర నాయకులు పొన్నం శ్రీను, తీర్మాలపూర్ ఎంపీటీసీ మోడీ రవి, కారుపాకల అంజిబాబు, కొలపురి రమేష్ కొత్త వెంకటేష్, ఉప్పు శ్రీనివాస్ పటేల్, యువమోర్చా నాయకులు దురుశెట్టి రమేష్, పోచంపల్లి నరేష్, రాంలక్ష్మణ్, పురేళ్ల శ్రీకాంత్, శివశంకర్ పాల్గొన్నారు.