- కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్వెల్లడి
న్యూఢిల్లీ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల్రలో అటవీ విస్తీర్ణం పెరిగిందని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021ను ఆయన గురువారం విడుదల చేశారు. దేశంలో 80.9 మిలియన్ హెక్టార్లలో అడవులు, చెట్ల విస్తీర్ణం పెరిగిందని, గడిచిన రెండేళ్లలో దేశంలో 2,261 చ.కి.మీ. మేర అడవులు విస్తరించాయని నివేదికలో పేర్కొన్నారు. దేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ ఉందని చెప్పారు. అటవీ విస్తీర్ణంలో ఏపీలో గరిష్టంగా 647 చ.కి.మీ మేర పెరుగుదల నమోదైందని, తర్వాతి స్థానాల్లో తెలంగాణలో 632 చ.కి.మీ మేర అటవీ విస్తీర్ణంలో పెరుగుదల నమోదైందని, ఒడిశాలో 537 చ.కి.మీ అటవీ విస్తీర్ణం పెరిగిందని మంత్రి భూపేంద్ర యాదవ్ వెల్లడించారు.