సామాజిక సారథి , బిజినపల్లి :మండల కేంద్రంలో ఈ నెల 14న హైదరాబాద్లో జరిగే BMS మహాధర్నా గోడపత్రికను BMS నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ మలిశెట్టి చంద్రశేఖర్ ఆవిష్కరించారు.అనంతరం విలేకర్లతో వారు మాట్లాడుతూ తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు అవుతున్న కార్మిక లోకానికి ఒరిగిందేమీ లేదు, కోటి 50 లక్షల మంది కార్మికులకు లబ్ధి చేకూర్చే కనీస వేతనాలను ఈ రోజు వరకు పెంచలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనాలు పెంచాలని ఉన్న, తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఒక్కసారి కూడా కనీస వేతనాల జీవోను సవరించలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారు కార్మిక లోకానికి ఎన్నెన్నో హామీలు ఇచ్చారు వెంటనే నిజాం షుగర్ తో పాటు కమలాపురం తో సహా అన్ని పరిశ్రమలను తెరిపిస్తామని కాంట్రాక్ట్ కార్మికులను అందర్నీ రెగ్యులరైజ్ చేస్తామని కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేస్తామని ప్రగల్బాలు పలికి ఎన్నెన్నో హామీలు ఇచ్చి గెలిచాక మర్చిపోయారు అని గుర్తు చేశారు. ఇటువంటి కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణలో కనీస వేతనాలజీవోను వెంటనే సవరించాలి.
అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలి . ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి.
అంగన్వాడి, ఆశ, మిడ్ డే మిల్స్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.
ప్రైవేట్ రవాణా వాహనాలకు ఇన్సూరెన్స్ రేటు 50% తగ్గించాలి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక బంధు స్కీం ప్రవేశపెట్టాలి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో స్ట్రీట్ వేండర్స్ యాక్ట్ అమలు చేయాలి.
తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు .
ఈ కార్యక్రమంలో BMS హమాలీ సంఘం అధ్యక్షులు కొండయ్య,మల్లేష్, సంగప్ప, కృష్ణయ్య, ప్రవీణ్, ఆంజనేయులు, అఫ్జల్, ఉపేందర్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.