సారథి న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: ప్రతి కేసులో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ సమగ్ర విచారణ చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్ జిల్లా పోలీసు అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ ఆఫీసులో పాల్వంచ, కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్లతో నేరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసుల వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేయాలని సూచించారు. సమగ్ర విచారణ జరిపి నేరస్తులకు శిక్షపడేలా చూడాలన్నారు. ఆన్లైన్ ద్వారా అర్జీలు తీసుకునేలా అధికారులకు అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలను అతిక్రమించిన వారిపై ఈ–చలానాలు విధించాలన్నారు. జిల్లావ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదుచేసి పట్టుబడిన వారి లైసెన్స్‌లను రద్దు చేయించాలన్నారు. పాతనేరస్తుల కదలికలపై ఎప్పటికప్పుడు ప్రత్యేకనిఘా ఉంచాలన్నారు. దొంగతనాల కేసుల్లో నిందితులను పట్టుకుని చోరీ సొత్తును రికవరీ చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల బారినపడకుండా జిల్లా ప్రజలందరికీ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో కొత్తగూడెం ఇన్చార్జ్ డీఎస్పీ, భద్రాచలం ఏఎస్పీ వినీత్జీ, డీసీఆర్బీ సీఐ షుకూర్, కొత్తగూడెం వన్‌టౌన్‌సీఐ రాజు, టూటౌన్ సీఐ సత్యనారాయణ, త్రీటౌన్ సీఐ వేణుచందర్, చుంచుపల్లి సీఐ గురుస్వామి, జూలూరుపాడు సీఐ నాగరాజు, పాల్వంచ సీఐ సత్యనారాయణ, అశ్వరావుపేట సీఐ ఉపేందర్, ఇతర ఎస్సైలు పాల్గొన్నారు.
- February 12, 2021
- Archive
- తెలంగాణ
- BADRADRI
- E -CALLAN
- KOTHAGUDEM
- SP SUNILDUTT
- ఈ–చలానాలు
- ఎస్పీ సునీల్‌దత్
- కొత్తగూడెం
- భద్రాద్రి
- Comments Off on ప్రతికేసులో నిష్పక్షపాత విచారణ