సామాజిక సారథి, కౌడిపల్లి: రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రాలలో అధికంగా తూకం వేసి నిలువునా మోసం చేస్తుందని బీజేపీ మండల అధ్యక్షుడు రాకేష్ ఆరోపించారు. గురువారం జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు పిలుపుమేరకు దేవులపల్లిలో ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోలు కేంద్రం వద్ద శంకరయ్య, సంగయ్య, శ్రీధర్ రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తా 40కిలోలు కాంట చేయడానికి బదులు 42కిలోలు తూకం వేసినప్పటికీ సకాలంలో లారీలు రావడంలేదని రైతులు వాపోతున్నారని తెలిపారు. లారీలు మూడు రోజులకొస్తే బస్తాలను ఖాళీ చేసినప్పటికీ రెండు కిలోల బరువు తగ్గిపోతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. లారీలను సరఫరా చేసే కాంట్రాక్టర్ నయీమ్ పై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కౌడిపల్లి మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు నర్సిములు, మండల పార్టీ అధ్యక్షులు బీజేవైఎం కార్యదర్శి బీరప్ప , బీజేపీ నాయకులు లింగం, రాజబోయిన వెంకటి, భాగయా, నాయకులు పాల్గొన్నారు.
- November 25, 2021
- Archive
- Top News
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- Comments Off on రైతులను మోసం చేస్తున్న ఐకేపీ