సామాజిక సారధి , బిజినేపల్లి : బీ ఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఒక్క ఫోన్ కాల్ తో పోలీసులకు చెప్పి వారితో స్టేషన్లోనే తొక్కిస్తాను అంటూ ఓ రెడ్డి లీడర్ ఇచ్చిన వార్నింగ్ కాల్ రికార్డింగ్ చర్చనీయంగా మారింది . ఇటీవల కాలంలో మండలంలోని వెలుగొండ గ్రామంలో హైదరాబాదులో ఉండే ఓ రెడ్డి గ్రామంలో ఉన్నవారిపై పెత్తనం చేస్తున్నాడని తీవ్రంగా మండల వ్యాప్తంగా చర్చనీయమైన సంఘటన తెలిసింది . ఇంతవరకు బాగానే ఉన్నా గత రెండు రోజుల క్రితం వెలుగొండ గ్రామంలో కొందరు యువకులు ఏడేళ్ల నుంచి గ్రామంలో అభివృద్ధి జరగలేదని , కనీసం ఒక్కరికైనా డబల్ బెడ్ రూమ్ ఇల్లు అందలేదని , కనీసం గూడు జాగలేని పేదవారికి కొంత స్థలం కూడా కేటాయించలేదని టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ గ్రామంలోని గ్రూపులలో పోస్టులు పెట్టారు . పెట్టిన కొంతసేపటికి హైదరాబాద్ నుంచి ఓ రెడ్డి లీడర్ ఆ యువకులకు వెంటనే ఫోన్ చేశాడు .. హలో ఎవరు మీరు , అనగానే మీరు ఎవరో అని యువకులు చెప్పడంతో వెంటనే రెడ్డి తిట్ల పురాణం మొదలు పెట్టాడు . చెప్పుకోలేని మాటలను యువకులను నాన్న దుర్బసలాడుతూ నా ల … కొడుకులారా ఒక్క ఫోన్ కాల్తో మిమ్మల్ని పోలీస్స్టేషన్లో వేసి తొక్కిస్తాన్ రా .. అంటూ బెదిరించడమే కాకుండా ఇకనుండి గ్రామంలో ఎవ్వరైనా వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిని గ్రామంలో ఉండనీయకుండా చేస్తానంటూ వార్నింగ్ ఇవ్వడం పట్ల యువకులు ఆశ్చర్యాన్నికి గురవుతున్నారు . గ్రామ అభివృద్ధి కొరకు పోస్టులు పెడితే అంత అసభ్యంగా దుర్భాసలాడాలానా .. ఇదేం తీరు , ఎక్కడో హైదరాబాదులో ఉండి గ్రామంలో రాజకీయాలను తానే శాసిస్తున్నట్లు తన ప్రమేయం లేకుండా గ్రామంలో ఏదీ జరగదు అంటూ ప్రగడపాలు పలుకుతూ బెదిరించడం సబబు కాదని పలువురు గ్రామంలో ఆయన గారు బెదిరింపు తీరు కాల్ రికార్డును విని ఇదేం పాలన రా అంటూ విసిగిపోతున్నారు . ఆయన చెప్పిందే పోలీసులు వినాలంట … గ్రామంలో ఏ పెద్దమనిషి ఏ కార్యాలయానికి వెళ్లి పనులు చేయకూడదంట … గ్రామానికి ఏది జరిగిన తననుంచే జరగాలని .. గొప్పలు చెప్పుకుంటూ పలువురికి వార్నింగులు ఇవ్వడం కూడా ఇదివరకే జరిగిపోయిందని తెలిసింది . ఇలాంటి లీడర్తో గ్రామంలో ప్రజలను దుర్భసలాడితే ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని గ్రామస్తులు అంటున్నారు .
- February 4, 2023
- Archive
- Top News
- ముఖ్యమైన వార్తలు
- Comments Off on వ్యతిరేక పోస్టులు పెడితే .. అక్రమ కేసులు పెట్టి పోలీసులతో తొక్కిస్తా..