సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళా సర్పంచ్ భర్త గ్రామంలో సీసీరోడ్లు వేయమని అడిగిన ఓ గిరిజన యువకుడిని నానాదుర్భాషలాడాడు. ‘నీవు నన్ను గెలిపించావా?.. నీకెందుకు ’అంటూ ఫోన్ లోమాటలతో ఊగిపోయాడు. ఆ గ్రామంలో ఫలానా ఏరియాలో సీసీరోడ్డు వేయమని అడిగాడు. సీసీరోడ్లను సర్పంచ్ ఇంట్లో నుంచి తెచ్చి వేస్తున్నాడా.. అందరికీ వేస్తే బాగుంటుందని కదా అని ఓ వాట్సప్ గ్రూపులో మెసేజ్ చేయడంతో ఇది చూసిన సర్పంచ్ భర్త గిరిజన యువకుడిని నానా బూతులు తిట్టాడు. ‘ఏం పీకుతావ్ రా.. నాకు ఇష్టం చోట రోడ్లు వేస్తాను.. నాకు నీవైనా ఓటువేశావా? నా ఇష్టం ఉన్న దగ్గర నేను రోడ్లు వేస్తాను. నీకు దగ్గర మాత్రం రోడ్లు వేయను. ఏం చేసుకుంటావో చేసుకోరా? మళ్లీ మాట్లాడావ్ అనుకో’ అంటూ రాయలేని మాటలను ఆ సర్పంచ్ భర్త తిట్టిన బూతు పురాణం సంభాషణ సోషల్ మీడియాలో నాగర్ కర్నూల్ జిల్లా సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది. ఇదెక్కడి అన్యాయం రా నాయనా! గ్రామంలో సీసీరోడ్లు లేనిచోట్ల వేయాలని కోరినందుకే ఇలా బూతు పురాణం తిట్టడం ఏమిటని సంభాషణ విని మండల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
- March 26, 2023
- Archive
- Top News
- పొలిటికల్
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- Comments Off on సీసీరోడ్లు వేయమంటే.. సర్పంచ్ భర్త బూతు పురాణం