- ఎమ్మెల్యే అబ్రహం భరోసా
- కల్లుతాగి మృతిచెందిన కుటుంబాలకు పరామర్శ
సారథి, మానవపాడు: కల్తీ కల్లు తాగి చనిపోయిన మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం ఆదివారం మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చేరుకుని పరామర్శించారు. నాయక వెంకటరాముడు కుటుంబానికి రైతుబీమా పథకం ద్వారా రూ.ఐదు లక్షలు ప్రభుత్వం నుంచి త్వరగా వచ్చే విధంగా చేయాలని వ్యవసాయ అధికారులతో మాట్లాడి ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. వెంకన్నకు టీఆర్ఎస్ పార్టీ సాధారణ సభ్యత్వం ఉందని, పార్టీ నుంచి సహకారం అందిస్తామన్నారు. పింజరి సిద్ధయ్య కుటుంబానికి ప్రభుత్వం తరఫున వితంతు పెన్షన్ వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చి ఆ కుటుంబాలను ఓదార్చారు. ఎమ్మెల్యే వెంట రైతు సమన్వయ సమితి చైర్మన్ వెంకటేశ్వర్లు, యువనాయకుడు శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.