సామాజిక సారథి, సిద్దిపేట: మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలకు చెందిన టీఆర్ఎస్ పార్టీ నేతలు ఇంటింటా ప్రచారం చేసినట్లు టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు వంగ వెంకట్రాంరెడ్డి తెలిపారు. ఆదివారం మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, కట్కూర్ సర్పంచ్ జిల్లెల్లె అశోక్ రెడ్డి, చౌటపల్లి సర్పంచ్ గద్దల రమేశ్, మీర్జాపూర్ మాజీ సర్పంచ్ బండి రమణారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల కోశాధికారి పొన్నబోయిన శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ భూక్యా తిరుపతి, మాజీ వార్డు సభ్యులు వేల్పుల రాజయ్య, వేల్పుల మొండయ్య తదితరులు పాల్గొన్నారు.
- October 31, 2022
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- by-elections
- campaigning
- Earlier
- HUSNABAD
- LEADERS
- MLAs
- Comments Off on మునుగోడు ప్రచారంలో హుస్నాబాద్, అక్కన్నపేట నేతలు